నవంబరులో వసంత మండపంలో కార్తీక మాస విష్ణుపూజలు తిరుమల, 2022 అక్టోబరు 29: లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 4 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల్లో తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పూజలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నవంబరు 4న శుక్రవారం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా, నవంబరు 5న మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు కైశికద్వాదశి – శ్రీ తులసీ దామోదర పూజ, నవంబరు 10న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు గోపూజ, నవంబరు 21న ఉదయం 10 నుండి 11 గంటల వరకు ధన్వంతరి జయంతి నిర్వహిస్తారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
