నవంబరు 8న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
– చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు ఆలయ తలుపులు మూత తిరుపతి, 2022 నవంబరు 05: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉదయం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. ఉదయం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 8 గంటల వరకు శుద్ధి చేస్తారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు అలంకారం, సహస్రనామార్చన, నివేదన, దీపారాధన, రాత్రి 10 నుండి 10.15 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
