శ్రీ‌నివాస సేతు నిర్మాణం పూర్తి చేయాలి – అధికారుల‌కు టిటిడి ఈవో ఆదేశం



పెండింగ్‌లో ఉన్న శ్రీనివాస సేతు పనులను ఈ చివరి నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి అన్నారు.

శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో టీటీడీ, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ అధికారులతో సమీక్షించిన ఈఓ రామానుజ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేయనున్న ఫ్యాబ్రికేటెడ్‌ గర్డర్‌లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకంటే ముందే రోడ్లు, డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌లు, మీడియన్స్‌ పనులు పూర్తి చేయాలన్నారు.

రామానుజ సర్కిల్‌ నుంచి మామిడి మార్కెట్‌, కళాంజలి షోరూమ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు పనులు వేగవంతం చేయాలని ఈఓ తెలిపారు.

ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టే సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, కార్పొరేషన్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, సీఈ శ్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.