శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం

 శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం

తిరుప‌తి‌, 2022 న‌వంబ‌రు 12: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 22వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.